ఎవరికీ ఒక్క పైసా కూడా ఇవ్వొద్దు: కేటీఆర్
- భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసమే కొత్త రెవెన్యూ చట్టం
- ఈ ప్రక్రియ మొత్తం ఉచితంగా జరుగుతుంది
- క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చేస్తాం
హైదరాబాదులో సుమారు 24.50 లక్షల ఆస్తులు ఉన్నట్టు అంచనా వేశామని కేటీఆర్ తెలిపారు. ప్రజలంతా నిశ్చింతగా వారి ఆస్తిపై హక్కులను పొందేలా చేయడమే తమ ప్రయత్నమని చెప్పారు. భవిష్యత్తులో ఆస్తుల క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలిపారు. సామాన్యుడికి కొత్త రెవెన్యూ చట్టం అండగా ఉంటుందని, అవినీతికి పాతర వేస్తూ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని అన్నారు. రానున్న రోజుల్లో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ద్వారానే జరుగుతాయని చెప్పారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు వేర్వేరు రంగుల్లో పాసుపుస్తకాలను ఇస్తామని తెలిపారు.