భూమికి ఓ బుల్లి చంద్రుడు... చుట్టూ తిరుగుతున్న వీడియోలు విడుదల!
- కక్షలోకి వచ్చిన బూస్టర్ రాకెట్ శకలం
- భూమి చుట్టూ తిరుగుతుండటంతో గుర్తించిన శాస్త్రవేత్తలు
- 60వ దశకంలో ప్రయోగించారని వెల్లడి
తాము కనుగొన్న ఈ విషయం చాలా పెద్దదని, అంతరిక్ష పరిశోధకుడు క్యాస్పర్ విర్జ్ చోస్ వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో మినీ మూన్ ఫోటోలను పెట్టారు. దీన్ని తొలిసారిగా ఫిబ్రవరి15న గుర్తించామని ఆయన తెలిపారు. ఈ విశ్వంలో లక్షల ఆస్ట్రాయిడ్స్ తిరుగుతుంటాయని, ఎర్త్ ఆర్బిట్ లోకి వచ్చిన రెండో ఆస్ట్రాయిడ్ ఇదని ఆయనఅన్నారు.