సజ్జల ప్రోత్సాహంతోనే కొడాలి నాని ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేశాడు: వర్ల రామయ్య
- బూతుల మంత్రి అంటూ వర్ల వ్యాఖ్యలు
- నాని వ్యాఖ్యలపై ఢిల్లీ సీరియస్ అయ్యిందన్న వర్ల
- ప్రధాని కార్యాలయంతో బేరాలాడుతున్నారని వెల్లడి
ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య ట్విట్టర్ లో స్పందించారు. ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతోనే బూతుల మంత్రి కొడాలి నాని ప్రధాని మోదీపై పూనకం వచ్చినట్టుగా కించపరిచే వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై ఢిల్లీ సీరియస్ అయ్యేసరికి... 'నానికి చదువు సంధ్యలు లేవని, అవగాహన లేక అటువంటి వ్యాఖ్యలు చేశాడని, అతడిని క్షమించండి అని ప్రధాని కార్యాలయంతో బేరమాడుతున్నారు' అంటూ వర్ల ఎద్దేవా చేశారు.