భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వ్యాఖ్యలు
- విభేదాలను తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి
- చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలి
- మా దేశం ఎప్పుడూ ఆధిపత్యాన్ని కోరుకోదు
కాగా, తాము దేశీయంగా, అంతర్జాతీయంగా నూతన అభివృద్ధి నమూనాని రూపొందించాలని ధ్యేయంగా పెట్టుకున్నామని జిన్ పింగ్ చెప్పారు. తమ దేశం ప్రపంచ ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పాటునందిస్తుందని ఆయన తెలిపారు. తమ దేశం అభివృద్ధి చెందుతున్న దేశమని, ప్రపంచ దేశాలతో సత్సంబంధాలకు కట్టుబడి ఉందని చెప్పారు. పలు దేశాలతో ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు. కాగా, కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు కలిసి కృషి చేయాలని ఆయన చెప్పారు. ఇందుకోసం ఉమ్మడి ప్రణాళికను రూపొందించాలని ఆయన అన్నారు. కరోనా వైరస్ సమస్యను రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు.