యాపిల్ నుంచి వస్తున్న చిన్న ఫోన్.. ఐ ఫోన్ 12 మినీ!
- అక్టోబర్ లో విడుదల కానున్న కొత్త ఫోన్
- పేరు ఐఫోన్ 12 మినీ
- 5 జీ టెక్నాలజీతో కొత్త ఫోన్
తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి, అక్టోబర్ లో ఈ ఫోన్ విడుదల కానుంది. కాగా, ఇప్పటికే ఐపాడ్, మాక్ కంప్యూటర్లలో యాపిల్ మినీ వర్షన్లను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో 4, 5వ తరం ఫోన్లు చిన్నవే. ఇక, ఈ కొత్త ఫోన్లు 5జీ రేడియో తరంగాలకు మద్దతిస్తాయని, ఓఎల్ఈడీ స్క్రీన్లు, 60 హెర్జ్ రిఫ్రష్ రేటు, అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తాయని సంస్థ ప్రతినిధులు అంటున్నారు.