స్కూల్ లైసెన్స్ రద్దయ్యేంత వరకు పోరాడతా: శివబాలాజీ
- శివబాలాజీ పిల్లలను ఆన్ లైన్ క్లాసుల నుంచి తొలగించిన స్కూల్
- హెచ్చార్సీని ఆశ్రయించిన శివబాలాజీ
- విచారించాల్సిందిగా డీఈవోను ఆదేశించిన హెచ్చార్సీ
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, హెచ్చార్సీ చాలా వేగంగా స్పందించిందని శివబాలాజీ కొనియాడారు. స్కూల్ నుంచి స్పందన వచ్చిందని, తమ పిల్లల ఆన్ లైన్ క్లాసులకు యాక్సెస్ ఇచ్చారని చెప్పారు. అయితే తమ పిల్లలను ఎందుకు తొలగించారో స్కూల్ యాజమాన్యం చెప్పాలని డిమాండ్ చేశారు. టెక్నికల్ సమస్య వల్ల అలా జరిగిందని స్కూల్ వాళ్లు చెపుతున్నారని అన్నారు. కానీ, కావాలనే ఇలా చేశారని, దానికి సంబంధించిన ఆధారాలను డీఈవోకి ఇచ్చామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరగకపోతే స్కూల్ లైసెన్స్ రద్దయ్యేంత వరకు పోరాడుతామని చెప్పారు. డీఈవోకు అన్ని విషయాలను వివరించామని తెలిపారు.