దేశంలో 54,87,581కు చేరిన కరోనా కేసుల సంఖ్య

COVID19 case tally at 5487581
  • కొత్తగా 86,961 మందికి కరోనా నిర్ధారణ
  • మృతుల సంఖ్య మొత్తం 87,882
  • కోలుకున్న వారు 43,96,399 మంది  
దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 86,961 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 54,87,581కు చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,130 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 87,882కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 43,96,399 మంది కోలుకున్నారు. 10,03,299 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
                       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 6,43,92,594 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 7,31,534 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
COVID-19
Corona Virus
India

More Telugu News