సుదీర్ఘ విరామం తర్వాత విజయవాడలో రోడ్డెక్కిన సిటీ బస్సులు
- తొలి దశలో ప్రయోగాత్మకంగా 100 బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
- ఈ నెల 26 వరకు మాత్రమే..
- సీటుకు ఒక్కరికి మాత్రమే అనుమతి
ప్రతీ స్టాప్ వద్ద ఆర్టీసీ ఉద్యోగి అందుబాటులో ఉంటాడని, శానిటైజ్ చేసిన తర్వాతే ప్రయాణికులను బస్సులోకి ఎక్కిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తప్పనిసరని ఆర్ఎం పేర్కొన్నారు. రాయితీలను అనుమతించబోమని, అలాగే నిల్చుని ప్రయాణించడం కూడా నిషిద్ధమని తెలిపారు. ప్రస్తుతం మైలవరం, ఆగరిపల్లి, విస్సన్నపేట, పామర్రు, విద్యాధరపురం, మంగళగిరి ప్రాంతాలకు 100 బస్సులను తిప్పుతున్నట్టు నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.