న్యాయ వ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తోంది: విజయసాయిరెడ్డి
- అందరూ సమానులే అనే సూత్రాన్ని విస్మరిస్తోంది
- ప్రాథమిక హక్కులను, మీడియా గొంతును నొక్కుతున్నాయి
- ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి
ఏపీలో న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై ఏపీ హైకోర్టు విధించిన స్టేలకు సంబంధించి న్యాయపరమైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు. పార్లమెంటు ప్రాంగణంలో వైసీపీ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ విజయసాయి పైవ్యాఖ్యలు చేశారు. ఇదే అంశాన్ని రాజ్యసభలో సైతం విజయసాయి లేవనెత్తారు.