చైనా తీరుపై రాజ్యసభలో రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన
- చైనా మాటలు ఒకలా, చేతలు మరోలా ఉన్నాయి
- ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొంటాం
- చైనా చర్యలకు సమాధానం చెబుతున్నాం
1988 తర్వాత భారత్, చైనాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాయని ఆయన గుర్తు చేశారు. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించడమే ఇందుకు నిదర్శనమని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. 1962లో చైనా 38వేల చదరపు కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని ఆక్రమించిందని తెలిపారు. ఆ సమయంలో పాకిస్థాన్ నుంచి 5,000 చదరపు కిలోమీటర్ల భూమిని కూడా తీసుకొందని అన్నారు.