ఏపీ కరోనా అప్ డేట్: 64 మంది మృతి, 8,835 మందికి పాజిటివ్
- ఉభయ గోదావరి జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు
- తాజాగా 10,845 మంది డిశ్చార్జి
- ఇంకా 90,279 మందికి చికిత్స
తాజాగా ఏపీలో 64 మంది మృత్యువాత పడ్డారు. దాంతో కరోనా మృతుల సంఖ్య 5,105కి పెరిగింది. రాష్ట్రంలో మరో 10,845 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 90,279 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,97,376 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు.