టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మంకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

HC grants bail to TDP leader Nadendla Brahmam
  • కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు
  • నాన్ బెయిలబుల్ కేసు పెట్టిన పోలీసులు
  • అరెస్ట్ చేయకుండా విచారించాలన్న హైకోర్టు
తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మంకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నాలుగు రోజుల క్రితం గుడివాడ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఈకేసు నమోదైంది.

దీంతో బెయిల్ కోసం హైకోర్టును బ్రహ్మం ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు పోలీసులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. నాదెండ్ల బ్రహ్మంను అరెస్ట్ చేయకుండా, విచారించాలని ఆదేశించింది.
Go Back to Shorts
Nadendla Brahmam
Telugudesam
Kodali Nani
YSRCP
AP High Court

More Telugu News