ఏపీలో 5 వేలు దాటిన కరోనా మరణాలు
- గత 24 గంటల్లో 69 మంది మృతి
- కొత్తగా 8,846 పాజిటివ్ కేసులు
- 9,628 మంది డిశ్చార్జి
తాజాగా 8,846 పాజిటివ్ కేసులు వచ్చాయి. 9,628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5,83,925కి పెరిగింది. మొత్తమ్మీద 4,86,531 మంది కరోనా నుంచి విముక్తులు కాగా, ఇంకా 92,353 మంది చికిత్స పొందుతున్నారు.