ఎంపీల జీతంలో 30 శాతం కోత.. బిల్లుకు లోక్ సభ ఆమోదం!
- ఆర్డినెన్స్ కు ఏప్రిల్ 6న ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
- ఈరోజు లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టిన వైనం
- రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్ నిధులు కూడా నిలిపివేత
దీనికి సంబంధించిన బిల్లును ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభలో ఆమోదముద్ర పడింది. మరోవైపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా వేతనాల కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మరోవైపు, ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండేళ్ల పాటు నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.