ఈ దీవి చాలా ప్రత్యేకం... లేడీస్ స్పెషల్!
- ఫిన్ లాండ్ తీరానికి సమీపంలో సూపర్ షీ ఐలాండ్
- 8.4 ఎకరాల్లో విస్తరించి ఉన్న చిన్న దీవి
- దీవిలో రిసార్టు ఏర్పాటు చేసిన అమెరికా మహిళా పారిశ్రామికవేత్త
ఈ 'సూపర్ షీ' దీవికి ఆమే యజమానురాలు. స్త్రీలకు మాత్రమే ప్రత్యేకంగా ఓ రిసార్టు ఏర్పాటు చేయాలని తలంచి, కొన్నేళ్ల కిందట ఈ దీవిని అందుకు అనుగుణంగా మార్చేశారు. ఈ రిసార్టులో అన్ని సౌకర్యాలతో పాటు స్పా, సాహస క్రీడల కోసం ఏర్పాట్లు కూడా ఉన్నాయి. యోగా చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు... అందుకోసం ప్రత్యేకంగా క్లాసులు కూడా నిర్వహిస్తారు. నోరూరించే అన్ని రకాల వంటకాలు ఈ ఐలాండ్ రిసార్టులో లభ్యమవుతాయి. ఇక్కడికి వచ్చే మహిళా టూరిస్టులు స్వయంగా వంట చేసుకోవాలనుకున్నా ఇక్కడ అందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయి.
'సూపర్ షీ' ఐలాండ్ లోని రిసార్టులో వసతి పొందాలంటే కనీసం పది మంది ఓ గ్రూప్ గా రావాల్సి ఉంటుంది. పురుషులంటే గిట్టని వాళ్లకు ఇది స్వర్గధామం అని యజమానురాలు క్రిస్టినా రూత్ చెబుతున్నారు. పురుషాధిక్య ప్రపంచంలో మానసిక ఉల్లాసానికి నోచుకోని మహిళలు ఇక్కడ నచ్చినట్టుగా గడపవచ్చని తెలిపారు.