ఐక్యరాజ్య సమితి కీలక కమిటీలో భారత్‌కు చోటు.. చైనాకు దారుణ పరాభవం!
- ‘యూఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్’లో సభ్యత్వం
- ఆఫ్ఘనిస్థాన్ కు ఎక్కువ ఓట్లు
- కనీస ఓట్లు సాధించలేకపోయిన చైనా
ఈ సందర్భంగా ఐరాసలోని భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి మాట్లాడుతూ.. లింగ సమానత్వం, మహిళా సాధికారత కోసం భారత్ చేస్తున్న కృషికి ఈ విజయం గుర్తింపు వంటిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన సభ్యదేశాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ గెలుపుతో యూఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్‌లో భారత్ సభ్యత్వం ఐదేళ్లపాటు అంటే 2025 వరకు ఉంటుంది. రహస్య ఓటింగ్ ద్వారా జరిగిన ఈ ఎన్నికలో నెగ్గడానికి కనీసం 28 ఓట్లు రావాలి. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ కు 39, భారత్ కు 38, చైనాకు 27 ఓట్లు పోలయ్యాయి.