తమిళంలో మరో భారీ చిత్రంలో కాజల్ కి ఛాన్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళంలో మరో భారీ చిత్రంలో కాజల్ కి ఛాన్స్

Kajal opposite Surya
  • కమర్షియల్ సినిమాకి గ్లామర్ అద్దిన కాజల్ 
  • హిందీలో 'ముంబై సాగా'లో కథానాయిక 
  • దక్షిణాదిన 'ఆచార్య', 'ఇండియన్ 2, 'తుపాకి 2'
  • తాజాగా సూర్య-హరి సినిమాలో ఛాన్స్ 
తెలుగు కమర్షియల్ సినిమాకు మరింత గ్లామర్ ను అద్దిన అందాల కథానాయికగా కాజల్ అగర్వాల్ ను చెప్పుకోవచ్చు. టాప్ హీరోలందరితోనూ కలసి నటించి, అగ్రశ్రేణి కథానాయికగా ఆమె రాణించింది. ఇప్పుడు కొత్త హీరోయిన్ల తాకిడితో కాస్త వెనుకపడినా, ఆమెకు అవకాశాలు వస్తూనే వున్నాయి. ఈ క్రమంలో తాజాగా తమిళంలో సూర్య సరసన ఓ భారీ చిత్రంలో నటించే ఛాన్స్ అమ్మడికి వచ్చింది.

గతంలో సూర్యతో 'ఆరు', 'వేల్' చిత్రాలతో పాటు 'సింగం' సీరీస్ లో మూడు సినిమాలు చేసి విజయం సాధించిన హరి దర్శకత్వంలో సూర్య ఇప్పుడు మరో చిత్రాన్ని చేస్తున్నాడు. ఇంతకుముందు సూర్యని యాక్షన్ హీరోగా చూపిన హరి ఈ తాజా చిత్రంలో ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలో చూపించబోతున్నాడట. ఇందులో కథానాయికగా తాజాగా కాజల్ ను తీసుకున్నట్టు సమాచారం.  

ఇదిలావుంచితే, ప్రస్తుతం కాజల్  హిందీలో 'ముంబై సాగా' చిత్రంలో నటిస్తోంది. అలాగే దక్షిణాదిన తెలుగులో చిరంజీవి సరసన 'ఆచార్య'లో నాయికగా నటిస్తోంది. ఇంకోపక్క తమిళంలో కమలహాసన్ పక్కన 'ఇండియన్ 2' చిత్రంలోనూ, విజయ్ హీరోగా మురుగదాస్ రూపొందించే 'తుపాకి' సీక్వెల్ లోను కూడా నటిస్తూ మూడు భాషలలోను తన కెరీర్ ని ఇంకా కొనసాగిస్తుండడం విశేషమే!
Kajal Agarwal
Acharya
Indian 2
Tupaki 2

More Telugu News