TikTok: టిక్ టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చేసిన యత్నాలు విఫలం!

Microsoft talks with TikTok unsuccessful
షార్ట్స్‌లో చూడండి
అమెరికాలోని టిక్ టాక్ కార్యకలాపాలను యూఎస్ సంస్థ సొంతం చేసుకుంటేనే దాన్ని కొనసాగిస్తామని... లేని పక్షంలో టిక్ టాక్ ను నిషేధిస్తామంటూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్ టాక్ ను సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ సంస్థలు పోటీ పడ్డాయి. అయితే, టిక్ టాక్ తో మైక్రోసాఫ్ట్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. టిక్ టాక్ ను అమ్మేందుకు దాని మాతృసంస్థ బైట్ డ్యాన్స్ సిద్ధంగా లేదని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ నేపథ్యంలో, అమెరికాలో టిక్ టాక్ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది.
Go Back to Shorts
TikTok
Microsoft
USA

More Telugu News