ఏపీలో ఇంకా తగ్గని కరోనా కల్లోలం

Corona effect still spreading across AP
  • ఒక్కరోజులో 66 మంది మృతి
  • కొత్తగా 9 వేలకు పైగా పాజిటివ్ కేసులు
  • 10,131 మంది డిశ్చార్జి
ఏపీలో కరోనా రక్కసి మరింత చెలరేగిపోతోంది. గడచిన 24 గంటల్లో 9,536 పాజిటివ్ కేసులు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లాలో 1,414 కొత్త కేసులు వెల్లడయ్యాయి. పశ్చిమ గోదావరి (1,076) జిల్లాలోనూ వెయ్యికి తగ్గకుండా పాజిటివ్ కేసులు గుర్తించారు. ఈ క్రమంలో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,67,123కి చేరింది.

ఇక రాష్ట్రవ్యాప్తంగా 66 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు సంభవించాయి. తద్వారా ఓవరాల్ కరోనా మృతుల సంఖ్య 4,912కి పెరిగింది. తాజాగా 10,131 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 95,072 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,67,139గా నమోదైంది.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Positive Cases
Deaths
COVID-19

More Telugu News