జడ్జి ఫోన్ నుంచి ప్రేమసందేశం... అగ్గిమీద గుగ్గిలమైన మహిళా ఎస్పై
- గుజరాత్ ఆమ్రేలి జిల్లాలో ఘటన
- జడ్జిని ప్రశ్నించిన లేడీ ఎస్సై
- తన ఇంటి పనిమనిషి సందేశాలు పంపి ఉండొచ్చన్న జడ్జి
ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో తెలియకపోవడంతో వెంటనే ఆ నెంబర్ కు కాల్ చేసింది. ఎవరు మీరు అని ప్రశ్నించగా, సెషన్స్ కోర్టు అడిషనల్ జడ్జిని అని సమాధానం వచ్చింది. ఈ మెసేజ్ లు ఎందుకు పంపారని నిలదీయగా, తాను ఆ సందేశాలు పంపలేదని, తన ఇంట్లో పనిమనిషి పంపి ఉండొచ్చని తెలిపాడు.
అయితే ఈ వాదన మహిళా ఎస్సైకి నమ్మశక్యంగా అనిపించలేదు. మీ ఫోన్ నుంచి మీ పనిమనిషి సందేశాలు పంపడం ఎలా సాధ్యమని అడిగితే అవతలి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆ మహిళా ఎస్సై జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.