ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సరిహద్దుల్లో కాల్పులు జరిపిన చైనా... ఆపై ఘర్షణ!
- సరిహద్దుల్లో కొనసాగుతున్న చైనా దురుసుతనం
- సోమవారం రాత్రి భారత బలగాలపై కాల్పులు
- తిప్పికొట్టిన భారత జవాన్లు
తాజాగా, రెజాంగ్లా హైట్స్ వద్ద భారత్ దళాలపై చైనా సైనికులు దాడికి దిగారు. పర్వతప్రాంతంపై మోహరించి ఉన్న భారత దళాలను తరిమివేసే ఉద్దేశంతో ముందుకొచ్చిన చైనా బలగాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరగనున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ ఘటనపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.