బ్యూటీషియన్ పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన స్నేహితులు!

UP beautician raped by her friends
  • ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో దారుణం
  • బర్త్ డే ఉందంటూ యువతిని పిలిచిన స్నేహితులు
  • మందు తాగించి, ఆపై అత్యాచారం
ఒక యువతి జీవితాన్ని ఆమె స్నేహితులే చిదిమేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ప్రయాగ్ రాజ్ లోని బెనిగంజ్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల ఓ యువతి బ్యూటీషియన్ గా పని చేస్తోంది. స్థానికంగా ఉన్న కొందరు యువకులతో ఆమెకు పరిచయం ఉంది.

ఈ క్రమంలో... బర్త్ డే పార్టీ ఉందంటూ సులేం సారాయ్ అనే స్నేహితుడు ఆమెను తన ఇంటికి పిలిచాడు. అక్కడికే ఇతర స్నేహితులు కూడా వచ్చారు. కేక్ కటింగ్ పూర్తైన తర్వాత అందరూ కలిసి మందు తాగారు. అనంతరం ఆమె మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత స్నేహితులంతా కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

మత్తు నుంచి తేరుకున్న తర్వాత ఆమెకు ఏం జరిగిందో అర్థమైంది. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అక్కడకు పోలీసులు వెళ్లేసరికి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
Go Back to Shorts
Uttar Pradesh
Prayag Raj
Beautician
rape

More Telugu News