తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు అభిమానుల తులాభారం

తెలంగాణ బీజేపీ అభిమానులు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు తులాభారం నిర్వహించారు. భైంసా బాధితుల కోసం నిర్వహించిన ఈ తులాభారం ఘట్టానికి హైదరాబాదులోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయం వేదికగా నిలిచింది. బండి సంజయ్ ఎత్తు నాణేలతో ఈ తులాభారం చేపట్టారు. ఈ సందర్భంగా వచ్చిన నిధిని భైంసా బాధితులకు అందిస్తామని బండి సంజయ్ వెల్లడించారు. కాగా, ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.


More Telugu News