ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ను దత్తత తీసుకున్న ప్రభాస్
- ఇటీవలే గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటిన ప్రభాస్
- 1000 ఎకరాల అటవీభూమిని దత్తత తీసుకుంటానని ప్రకటన
- మాట నిలబెట్టుకున్న ప్రభాస్
కాగా, ప్రభాస్ 1650 ఎకరాల అటవీభూమిని దత్తత తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ భూమి జిన్నారం మండలం ఓఆర్ఆర్ సమీపంలో ఉంది. ఈ ఫారెస్ట్ రిజర్వ్ భూమిని ప్రభాస్ తన తండ్రి దివంగత యూవీఎస్ రాజు పేరుమీద అర్బన్ పార్క్, అటవీప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే రూ.2 కోట్లు అందించిన ప్రభాస్, అవసరమైతే మరింత ఖర్చు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం.