ఏపీలో ఐదు లక్షలకు చేరువైన కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 10,794 కొత్త కేసులు
- 70 మంది మృత్యువాత
- తాజాగా 11,915 మందికి కరోనా నయం
అటు, రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజులో 70 మంది మృత్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 4,417కి చేరింది. తాజాగా 11,915 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తద్వారా 3,94,019 మంది కరోనా కోరల నుంచి విముక్తులయ్యారు. ఇంకా 99,689 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడం ఊరట కలిగించే అంశం.