వాళ్లు లేకపోతే ఇలా ఉండేవాడిని కాదు!: సెహ్వాగ్, గంభీర్ టీచ‌ర్స్ డే శుభాకాంక్ష‌లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాళ్లు లేకపోతే ఇలా ఉండేవాడిని కాదు!: సెహ్వాగ్, గంభీర్ టీచ‌ర్స్ డే శుభాకాంక్ష‌లు

sahwag teachers day wishes
  • నేను జీరో విద్యార్థిని: సెహ్వాగ్‌
  • జీరో ప్రాముఖ్యత ఏంటో టీచ‌ర్లు చెప్పారు
  • ప్ర‌తి అంకె వెనుక జీరో క‌లిపితే విలువ పెరుగుతుంది
ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లువురు క్రికెట‌ర్లు టీచ‌ర్ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. టీచ‌ర్ల గొప్ప‌దనం ఏంటో వివ‌రించారు. త‌న‌లాంటి జీరో విద్యార్థులకు ఉపాధ్యాయులు దాని ప్రాముఖ్యత ఏంటో చెప్పారని టీమిండియా మాజీ క్రికెట‌ర్ సెహ్వాగ్ అన్నారు. ప్ర‌తి అంకె వెనుక‌ ఆ సున్నాని జోడిస్తే ఎంత‌గా విలువ పెరుగుతుందో టీచ‌ర్లు వివరించారని, ఉపాధ్యాయులందరికీ టీచ‌ర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నాన‌ని అన్నారు.

తన గురువులు లేకుండా తాను ఈ స్థాయికి వచ్చే వాడిని కాదని మాజీ క్రికెట‌ర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ అన్నారు. సెహ్వాగ్, గంభీర్ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఉపాధ్యాయ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్లు చేశారు.
sahwag
ganbhir
Cricket

More Telugu News