కంగనా చెంప పగలగొడతామన్న ప్రతాప్ సర్నాయక్ ను అరెస్ట్ చేయండి: రేఖాశర్మ 

  • కంగనకు ముంబైలో నివసించే అర్హత లేదన్న శివసేన ఎమ్మెల్యే
  • కంగనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్
  • ముంబైకి వస్తే కంగనా చెంప పగలగొడతారని వ్యాఖ్య
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ముంబైలో అడుగుపెడితే మహిళలు చెంప పగలగొడతారని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా నాయక్ మండిపడ్డారు. ప్రతాప్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేయాలని ట్వీట్ చేశారు.

ఓ ఇంటర్వ్యూలో ప్రతాప్ మాట్లాడుతూ, ముంబైలో నివసించే అర్హత కంగనకు లేదని చెప్పారు. కంగనకు తమ ఎంపీ సంజయ్ రౌత్ ఒక చిన్న హెచ్చరిక జారీ చేశారని... ఒకవేళ ఆమె ముంబైకి వస్తే ధైర్యవంతులైన తమ పార్టీ మహిళలు ఆమె చెంప పగలగొట్టకుండా ఉండరని అన్నారు. ముంబై పోలీసులను కించపరిచేలా మాట్లాడిన కంగనాపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే రేఖాశర్మ స్పందించారు.


More Telugu News

Kangana Ranaut Bollywood Sanjay Raut Pratap Sarnaik