ప్రసాద్ శిరోముండనం ఎవరూ చూడలేదు.. కానీ వైజాగ్ లో శిరోముండనం చూస్తుంటే కడుపు మండుతోంది: సోమిరెడ్డి
- ఏపీలో దళితులపై పెరిగిన దాడులు
- ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం
- తాజాగా వైజాగ్ లో మరో శిరోముండనం
ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో వరప్రసాద్ అనే దళిత యువకుడికి పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేశారని, ఇదేమీ చిన్న విషయం కాదని అన్నారు. ఓ పోలీస్ స్టేషన్ లోనే ఆ విధంగా జరిగిందని తెలిపారు. దీంట్లో రాష్ట్రపతి కార్యాలయం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని, అయినప్పటికీ ఘటనకు కారకులపై చర్యలు ఏవి? అని ప్రశ్నించారు. ఆ శిరోముండనం ఎలా చేశారో ఎవరూ చూడలేదని, కానీ వైజాగ్ లో తాజాగా జరిగిన శిరోముండనం ఘటనను వీడియోలో చూస్తుంటే కడుపు మండిపోతోందని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.