అనేక రాష్ట్రాలు కరోనాను జయిస్తున్నాయి.. ఏపీలో మాత్రం విజృంభణ: దేవినేని ఉమ
- మొత్తం కేసులు 4,14,164 కేసులు
- 3,796 మరణాలు
- పాజిటివ్ రేటు 17% పైగా పెరిగింది
- కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు?
'పటిష్ఠ ప్రణాళికలతో అనేక రాష్ట్రాలు కరోనాను జయిస్తున్నాయి. రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? వైఎస్ జగన్' అని దేవినేని ఉమ ప్రశ్నించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 62,024 మందికి కరోనా వైరస్ పరీక్షలు చేయగా 10,548 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,14,164కు చేరిన విషయం తెలిసిందే.