బాబాయ్ కి బెయిల్ వచ్చినా కరోనా చికిత్స జరుగుతోంది... ఎవరూ పరామర్శలకు రావొద్దు: రామ్మోహన్ నాయుడు
- అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు
- అభిమానుల ప్రార్థనలు ఫలించాయన్న రామ్మోహన్
- అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్
అయితే, బాబాయ్ కి బెయిల్ వచ్చినా, ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినందున వైద్యులు చికిత్స అందిస్తున్నారని, దయచేసి ఎవరూ పరామర్శించేందుకు రావొద్దని ఎంపీ అందరికీ విజ్ఞప్తి చేశారు. "మీ అభిమానమే మాకు కొండంత అండ. బాబాయ్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కింజరాపు కుటుంబం తరఫున పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కష్టకాలంలో మా కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు, టీడీపీ నేతలకు, కార్యకర్తలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను" అంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.