ఇలాగైతే ఎలా?... 'బిగ్ బాస్'పై నాగార్జున ఆగ్రహం!

Nagarjuna Fire on Biggboss
  • బిగ్ బాస్ షూటింగ్ ఆలస్యంపై ఆగ్రహం
  • అరియానా గ్లోరీ ఎంట్రీ షూట్ కు రోజంతా
  • అసంతృప్తిని వ్యక్తం చేసిన నాగ్ 
టాలీవుడ్ బిగ్ బాస్ షోకు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతూ ఉండటంపై నిర్వాహకులపై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈపాటికే ప్రోమోల షూటింగ్, కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లే షూటింగ్ ముగిసి, నెలాఖరు నుంచి హౌస్ లో షో ప్రారంభం కావాల్సి వుండగా, అది కాస్తా సెప్టెంబర్ 5కు వాయిదా పడింది. ఈ విషయంలోనే నాగ్ కాస్తంత అసంతృప్తిగా ఉన్న వేళ, ప్రోమోల షూటింగ్ ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.

నిన్న జెమినీ చానల్ యాంకర్ అరియానా గ్లోరీ హౌస్ లోకి వెళ్లే సీన్, యూ ట్యూబర్ మహబూబ్ దిల్ సేపైనా ఇదే సీన్ ను తీయాలని షెడ్యూల్ చేసుకోగా, అరియానా గ్లోరీ కోసమే రోజంతా శ్రమించాల్సి వచ్చింది. దీంతో మెహబూబ్ ప్రోమో షూటింగ్ నేటికి వాయిదా పడింది. ఒక్కరికోసమే రోజంతా సమయం కేటాయించాల్సి రావడం ఏంటని నాగ్ కోపడ్డారని తెలుస్తోంది.

కాగా, బిగ్ బాస్ హౌస్ సిబ్బంది సంఖ్యను తగ్గించి, హౌస్ లో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించాలని బిగ్ బాస్ నిర్వాహకులు యోచిస్తున్నారు.
Go Back to Shorts
Nagarjuna
Bigg Boss Telugu 4
Fire

More Telugu News