లాక్ డౌన్ మీరే చేశారు.. అప్పులు తీసుకున్న వాళ్లకు ఉపశమనం కలిగించాల్సింది కూడా మీరే: సుప్రీంకోర్టు
- లోన్ల రీపేమెంట్ పై మారటోరియం విధించిన ఆర్బీఐ
- వినియోగదారులపై వడ్డీ భారం మోపుతున్న బ్యాంకులు
- మానవతాకోణంలో చూడాలన్న సుప్రీంకోర్టు
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వమేనని... అందువల్ల మారటోరియం సమయంలో లోన్ రీపేమెంట్లకు సంబంధించి వడ్డీని చెల్లించకుండా ఉండేలా నిర్ణయం తీసుకోవాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వమేనని వ్యాఖ్యానించింది. ఆర్బీఐదే బాధ్యత అని తప్పించుకోవడం కుదరదని తెలిపింది. సెప్టెంబర్ 1లోగా ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాలని పేర్కొంది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద వడ్డీని ఎత్తేసే సదుపాయం కేంద్రానికి ఉంటుందని చెప్పింది. ఈ అంశాన్ని బిజినెస్ కోణంలో మాత్రమే చూడకూడదని... ప్రజల ఇబ్బందులకు సంబంధించి మానవతాకోణంలో చూడాలని సూచించింది.