Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయ్ స్టామినా.. 'మాస్టర్'కు ఓటీటీ నుంచి ఫ్యాన్సీ ఆఫర్!

Huge price for Vijays Master movie
  • విజయ్ నటించిన తాజా చిత్రం 'మాస్టర్'
  • లాక్ డౌన్ కారణంగా ఆగిన విడుదల
  • పోటీపడుతున్న నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్    
  • ఓటీటీ సంస్థల నుంచి 100 కోట్ల వరకు ఆఫర్
తమిళంలో హీరో విజయ్ కున్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.. అతని సినిమా విడుదలైతే థియేటర్ల వద్ద చోటుచేసుకునే హంగామా మామూలుగా వుండదు. అందుకే, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన 'మాస్టర్' చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా? అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, గత ఏప్రిల్ లో విడుదల కావలసిన ఈ చిత్రం లాక్ డౌన్ తో థియేటర్లు మూతబడిన కారణంగా ఆగిపోయింది.

ఈ క్రమంలో పలు ఓటీటీ సంస్థలు ఈ చిత్రాన్ని డిజిటల్ వేదికగా డైరెక్టు రిలీజ్ చేయడానికి హక్కుల కోసం ప్రయత్నించాయి. అయితే, విజయ్ తో పాటు అభిమానుల ఒత్తిడి కారణంగా థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్ర నిర్మాత ఇన్నాళ్లు ఆగారు. కానీ, ఇప్పట్లో థియేటర్లు తెరచుకునే సూచనలు కనపడకపోవడంతో మళ్లీ ఓటీటీ సంస్థలు ఈ చిత్రం కోసం ట్రై చేస్తున్నాయి.

ఈ క్రమంలో రెండు, మూడు రోజులుగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలు పోటీపడుతూ భారీ రేటు ఆఫర్ చేస్తూ వస్తున్నాయి. 100 కోట్ల వరకు ఆఫర్ ఇస్తున్నాయని కోలీవుడ్ సమాచారం. ఈ రేటు ఇంకా పెరిగే ఛాన్స్ కూడా వుందని అంటున్నారు. మరి నిర్మాత ఓటీటీకి ఇచ్చేస్తాడా? లేక థియేటర్లు ఓపెన్ అయ్యేవరకు ఎదురుచూస్తారా? అన్నది త్వరలో తేలిపోతుంది!    
Vijay
Master
Lokesh Kanagaraj
OTT

More Telugu News