కరోనా బారినపడిన వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి

  • ఏపీలో కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేలు
  • తనకు వైరస్ సోకినట్టు వెల్లడించిన తిరుపతి ఎమ్మెల్యే
  • లక్షణాలు పెద్దగా లేవన్న కరుణాకర్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆ మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు కొవిడ్ బారినపడ్డారు. తాజాగా, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి కరోనా వైరస్ సంక్రమించింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను కొవిడ్ పరీక్ష చేయించుకున్నానని, పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. అయితే, లక్షణాలు పెద్దగా లేవని, చాలా స్వల్పంగా ఉన్నాయని తెలిపారు.

Chittoor District
Tirupati
Bhumana Karunakar Reddy
Corona Virus

More Telugu News