ఏపీలో మరోసారి భారీగా కరోనా మరణాలు... 24 గంటల్లో 92 మంది మృతి
- 3,460కి పెరిగిన కరోనా మరణాలు
- కొత్తగా 9,927 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో ఇంకా 89,932 యాక్టివ్ కేసులు
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 16 మంది, అనంతపురం జిల్లాలో 11 మంది, కడప జిల్లాలో 10 మంది, ప్రకాశం జిల్లాలో 10 మంది కరోనాతో కన్నుమూశారు. ఈ క్రమంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,460కి పెరిగింది.
తూర్పు గోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. జిల్లాలో మరోసారి వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. రాష్ట్రంలో మొత్తమ్మీద 3,71,639 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,78,247 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నారు. ఇంకా 89,932 యాక్టివ్ కేసులు ఉన్నాయి.