దేశంలో 24 గంటల్లో 60,975 మందికి కరోనా

COVID19 case tally crosses 31 lakh mark with 60975 fresh cases
  • మొత్తం కేసులు 31,67,324 
  • మృతుల సంఖ్య మొత్తం 58,390
  • కోలుకున్న వారు 24,04,585 మంది
  • 7,04,348 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  
దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 60,975  మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 848 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 31,67,324 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 58,390కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 24,04,585 మంది కోలుకున్నారు. 7,04,348 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.
                                                       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 3,68,27,520 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే  9,25,383 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
COVID-19
Corona Virus
India

More Telugu News