Viral Videos: దీనిని చూస్తే 'దోశ'పై విరక్తి కలుగుతోందట... వీడియో వైరల్

dosha video goes viral
షార్ట్స్‌లో చూడండి
తమిళనాడులో ఓ వ్యక్తి స్వయంగా  దోశ వేసి తినాలని అనుకున్నాడు. అందుకోసం అన్నింటినీ సిద్ధం చేసుకుని దోశ వేశాడు. ఆ దోశలో టమాట, క్యాప్సికమ్‌, కెచప్‌, సాస్‌తో పాటు‌ మసాలాలు, వెన్న వంటి వన్నీ వేశాడు. అయితే, ఇన్ని పదార్థాలను పెద్ద మొత్తంలో దోశలో వేయడంతో అది దోశలా కాకుండా మరో కొత్త రకం వంటకంగా తయారైంది. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది.

అన్ని పదార్థాలను మిక్స్‌ చేసి, అతడు వేసుకున్న ఈ దోశకు  'రెడ్‌ సాస్‌ పాస్తా దోశ' అనే పేరు పెట్టాడు. ప్రపంచంలో ఇటువంటి దోశను ఎవ్వరూ తయారు చేసి ఉండబోరని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.దయచేసి మరోసారి ఇటువంటి ప్రయోగాలు చేయొద్దని, దాన్ని చూస్తే దోశ మీదే విరక్తి వస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతడు ఏదో చేయాలని తలచి, మరేదో చేశాడని సెటైర్లు వేస్తున్నారు.
Go Back to Shorts
Viral Videos
Tamilnadu

More Telugu News