టీవీ చూసినా, క్యారమ్స్ ఆడినా జరిమానా తప్పదు: పశ్చిమ బెంగాల్ లోని గ్రామ కమిటీ ఫత్వా
- పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో జారీ అయిన ఫత్వా
- తప్పును బట్టి జరిమానా, భౌతిక శిక్షలు
- ఏ తప్పునకు ఎంత జరిమానా విధించేదీ తెలిపేలా బ్యానర్ల ఏర్పాటు
ఏ తప్పునకు ఎంత జరిమానా అంటే..
* టీవీ చూడడం, మొబైల్ ఫోన్, కంప్యూటర్‌లలో మ్యూజిక్ వింటే రూ. 1,000 జరిమానా
* కేరమ్స్ ఆడితే రూ. 500
* లాటరీ టికెట్ కొంటే రూ. 2 వేలు
* మద్యం అమ్మితే రూ. 7 వేల జరిమానాతోపాటు శిరోముండనం చేసి గ్రామంలో ఊరేగింపు
* లాటరీ టికెట్లు విక్రయిస్తే రూ. 7 వేలు
* మద్యం తాగితే 2 వేల జరిమానా, చెవులు పట్టుకుని పది గుంజీలు
* గంజాయి కొంటే రూ. 7 వేలు
నిబంధనలు ఉల్లంఘించిన వారికి సంబంధించిన సమాచారం అందిస్తే తప్పును బట్టి రూ. 200 నుంచి రూ. 2 వేల వరకు నజరానా ఇస్తామని గ్రామ కమిటీ ప్రకటించింది.