శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాద ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్

KCR orders CID inquiry on Srisailam power house fire accident
  • ప్రమాద ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి
  • ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని ఆదేశం
  • గోవింద్ సింగ్ ను విచారణాధికారిగా నియమించిన సీఎస్
శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంపై సీఐడీ విచారణకు ఆయన ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ను విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నివేదిక అందించాలని ఆదేశించారు.
Go Back to Shorts
Srisailam
Fire Accident
KCR
TRS
CID

More Telugu News