శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంలో ఏఈ సుందర్, మరో ఐదుగురి మృతదేహాలు లభ్యం
- శ్రీశైలం పవర్ హౌస్ లో ప్రమాదం
- లోపలే చిక్కుకుపోయిన 9 మంది
- మరో ముగ్గురి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు
మిగిలిన 15 మందిలో ఆరుగురిని సహాయక సిబ్బంది కాపాడారు. లోపలే చిక్కుకుపోయిన 9 మందిలో ఒకరి మృతదేహాన్ని ఈ మధ్యాహ్నం కనుగొన్నారు. ఆ మృతదేహం ఏఈ సుందర్ నాయక్ ది అని గుర్తించారు. తాజాగా మరో ఐదు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ఇంకా మరో ముగ్గురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలం మృతుల రోదనలతో కన్నీటిసంద్రాన్ని తలపిస్తోంది.