ఆవు కాలికి గాయం.. నడిస్తే నొప్పి ఎక్కువవుతుందని, హెలికాప్టర్‌లో తరలించిన రైతు!

  • స్విట్జర్లాండ్‌లో ఘటన
  • మేతకు వెళ్లి గాయపడిన గోవు
  • నొప్పితో విలవిల్లాడిన ఆవు
కాలికి గాయం కారణంగా తాను పెంచుకుంటున్న ఆవు కుంటుతూ నడుస్తుండడంతో గమనించిన యజమాని హెలికాప్టర్ ద్వారా దానిని ఇంటికి తరలించారు. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వత సానువుల్లోకి మేతకు వెళ్లిన ఆవు గాయపడింది.

 నొప్పితో విలవిల్లాడుతున్న గోవు కుంటుతూ నడుస్తుండడం చూసిన యజమాని దానిని ఇంటి వరకు నడిపించి తీసుకెళ్తే గాయం మరింత పెద్దదవుతుందని భావించాడు. హెలికాప్టర్ ద్వారా దానిని ఇంటికి తరలించాలని నిర్ణయించుకుని హెలికాప్టర్‌కు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది గోవుకు తాళ్లు కట్టి దానిని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆవుపై యజమానికి ఉన్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్లు చేస్తున్నారు. లక్షలాదిమంది ఈ వీడియోను రీట్వీట్ చేస్తున్నారు.

switzerland
Cow
Helicopter
airlift

More Telugu News