అభివృద్ధి అనేది కేవలం బీజేపీ వల్లనే: సోము వీర్రాజు
- శ్రీకాకుళం జిల్లాలో సోము వీర్రాజు పర్యటన
- ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
- అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరువ చేయాలన్న సోము
కేంద్రం అందిస్తున్న అభివృద్ధి ఫలాలను ప్రతి సామాన్యుడి వరకు చేరేలా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన నూతన విద్యావిధానం గురించి ప్రస్తావిస్తూ, నాడు వాజ్ పేయి సర్వ శిక్ష అభియాన్ తో విద్యావిధానంలో పెను మార్పులు సృష్టించారని, నేడు మోదీ నూతన విద్యావ్యవస్థతో భావితరాలకు బంగారు బాట వేస్తున్నారని కీర్తించారు.