కరోనా నుంచి కోలుకున్న వారిలో అనారోగ్య సమస్యలు.. ఢిల్లీలో పోస్ట్ కోవిడ్ క్లినిక్ ప్రారంభం!
- రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో క్లినిక్ ప్రారంభం
- కొందరిలో ఆక్సిజన్ స్థాయులు పడిపోతున్నాయన్న కేజ్రీవాల్
- దగ్గు, ఆయాసం, నీరసం వంటి సమస్యలతో బాధపడుతున్న బాధితులు
కరోనా నుంచి కోలుకున్న తర్వాత అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే వారికి ఈ క్లినిక్ లో వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ షేర్వాల్ మాట్లాడుతూ, కరోనా నుంచి కోలుకుంటున్న వారిలో పలు సమస్యలు వస్తున్నాయని... దగ్గు, ఆయాసం, నీరసం వంటి సమస్యలు వస్తున్నాయని... అన్ని వయసుల వారిలో ఈ సమస్యలు వస్తున్నాయని చెప్పారు.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ, కరోనా నెగెటివ్ వచ్చి ఇంటికి వెళ్లిన వారిలో కొందరిలో ఆక్సిజన్ స్థాయులు పడిపోతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఇకపై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వారికి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.