ఏపీలో 'ఫోన్ ట్యాపింగ్' కలకలంపై హైకోర్టులో విచారణ.. సీబీఐ దర్యాప్తు కోరిన పిటిషనర్
- కొందరు జడ్జీల ఫోన్ నంబర్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపణలు
- ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్ దాఖలు చేయాలన్న కోర్టు
- విచారణ ఎందుకు జరపకూడదో చెప్పాలని ప్రభుత్వానికి ప్రశ్న
ఇందుకోసం సీబీఐతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఈ రోజు హైకోర్టు విచారణ జరిపింది. ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి హైకోర్టు తెలిపింది.
అలాగే, ఈ అంశంపై ఎందుకు విచారణ జరపకూడదో చెప్పాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై రెండు రోజుల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలంటూ సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసులో విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.