కోమాలో ప్రణబ్ ముఖర్జీ.. వెంటిలేటర్ పై కొనసాగుతున్న చికిత్స!
- పరిస్థితి అత్యంత విషమం
- కోమా నుంచి బయటకు వస్తేనే ఆరోగ్యంపై అంచనా
- కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులు
నిన్న ఆయన ఆరోగ్యం స్వల్పంగా మెరుగుపడిందని ప్రకటన రావడంతో, ఆయన కోలుకుంటారని పార్టీ వర్గాలు, అభిమానులు భావించారు. ఇంతలోనే ఆయన కోమాలోకి వెళ్లారని వచ్చిన ప్రకటన వారిలో ఆందోళనను పెంచుతోంది. ప్రణబ్ కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. ప్రణబ్ కోమా నుంచి బయటకు వస్తేనే ఆరోగ్యంపై ఓ అంచనాకు రావచ్చని ఎయిమ్స్ డాక్టర్ ఒకరు వ్యాఖ్యానించారు.