ఈ రెండు భయాలు మిమ్మల్ని భయపెడుతున్నాయి విజయసాయిరెడ్డి గారు: బుద్ధా వెంకన్న

  • ముఖ్యమంత్రిగా జగన్ ఫెయిలయ్యారనే ఆందోళన
  • మళ్లీ కరోనా కాటేస్తుందేమోననే భయం
  • మీ నాయకుడు ఇంట్లో పడుకుని 6 నెలలు అయింది
ముఖ్యమంత్రిగా జగన్ ఫెయిల్ అయ్యారనే ఆందోళన, మళ్లీ కరోనా కాటేస్తుందేమో అనే భయం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని వెంటాడుతున్నాయని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబు గురించి తపిస్తున్నారని అన్నారు. కరోనా రాగానే జగన్ పాలనపై నమ్మకం లేక హైదరాబాదుకు పారిపోయి వైద్యం చేయించుకున్న మీరా మాట్లాడేది విజయసాయిరెడ్డి గారూ? అని ట్వీట్ చేశారు.

కరోనాపై వీరోచిత పోరాటం చేస్తానంటున్న మీ నాయకుడు తాడేపల్లిలోని ఇంట్లో పడుకుని 6 నెలలైందని బుద్దా అన్నారు. ట్వీట్ల తిట్లతో మీరు, వీడియో కాన్ఫరెన్సు అంటూ అర్థంకాని తెలుగులో జగన్ కబుర్లు చెప్పడం తప్ప... ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే, రోడ్ల మీదే ప్రజలు ప్రాణాలు వదులుతుంటే పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు.

Budda Venkanna
Telugudesam
Chandrababu
Vijayasai Reddy
Jagan
YSRCP

More Telugu News