ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు... గత 24 గంటల్లో 6,780 కేసుల నమోదు
- మొత్తం కేసుల సంఖ్య 2,96,609
- 82 మంది మృతి
- అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 13 మంది మృత్యువాత
ఇక మరణాల సంగతి చూస్తే... జిల్లాల్లో మృత్యుఘంటికలు మోగుతున్నట్టే భావించాలి. గడచిన 24 గంటల్లో 82 మంది మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 13 మంది మరణించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,732కి పెరిగింది. ఇప్పటివరకు వచ్చిన పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,609 కాగా, కొత్తగా 7,866 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తమ్మీద 2,09,100 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు.