సుశాంత్ రాజ్ పుత్ నివాసంలో మిస్టరీ యువతి ఎవరో చెప్పిన పోలీసులు!
- జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య
- ఆ తర్వాత సుశాంత్ నివాసానికి వచ్చిన యువతి
- వీడియోలు వైరల్
ఆమె పేరు జమీలా అని, ఆమె నటి రియా చక్రవర్తి సోదరుడు షోయిక్ గాళ్ ఫ్రెండ్ అని వివరించాయి. జమీలా... సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త విని అతని నివాసానికి ప్రియాంక ఖేమాని, మహేశ్ శెట్టి అనే ఇతర స్నేహితులతో కలిసి వచ్చిందని, కానీ పోలీసులు అనుమతించకపోవడంతో సుశాంత్ ఇంటి పనివాళ్లతో మాట్లాడి తిరిగి వెళ్లిపోయిందని చెప్పారు. కాగా, ఇన్ స్టాగ్రామ్ లో సుశాంత్ తన ఇతర స్నేహితులతో కలిసివున్న ఫొటోలో జమీలా కూడా ఉంది.