మరో రెండు సంస్థలను చేజిక్కించుకునే ప్రయత్నాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్
- అర్బన్ ల్యాడర్, మిల్క్ బాస్కెట్ లపై రిలయన్స్ దృష్టి
- చివరి దశకు చేరుకున్న చర్చలు
- డీల్ విలువ రూ. 30 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా
అయితే, దీనిపై ఇప్పటి వరకు రిలయన్స్, అర్బన్ ల్యాడర్, మిల్క్ బాస్కెట్ సంస్థలకు చెందిన ప్రతినిధులెవరూ అధికారికంగా స్పందించలేదు. కరోనా నేపథ్యంలో మన దేశంలో ఆన్ లైన్ షాపింగ్ కు డిమాండ్ పెరిగింది. పాల వంటి నిత్యావసర వస్తువులను సైతం ఆన్ లైన్ ద్వారా వినియోగదారులు తెప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థలపై రిలయన్స్ దృష్టి సారించింది.