ధోనీ తొందరపడి, తప్పు చేశాడేమో: ఇంజమామ్ ఉల్ హక్

Injamam Comments on Dhoni
  • రిటైర్ మెంట్ ప్రకటించిన ధోనీ
  • ఇది ఇంట్లో కూర్చుని నిర్ణయించేది కాదు
  • మైదానంలో ప్రకటించి ఉండాలన్న ఇంజమామ్
ఇంత అర్థాంతరంగా రిటైర్ మెంట్ ను ప్రకటించి, మహేంద్ర సింగ్ ధోనీ తప్పు చేశాడేమోనని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాన్ ఉల్ హక్ అభిప్రాయపడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఆటకు స్వస్తి చెప్పడమన్న విషయం ఇంట్లో కూర్చుని తీసుకోవాల్సిన నిర్ణయం కాదని, మైదానంలో ఆ ప్రకటన చేసివుంటే బాగుండేదని అన్నారు. ధోనీ మరోసారి మైదానంలోకి రావాలని కోట్లాది మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారని, తాను కూడా అదే ఆశించానని అన్నారు. ధోనీ, ఓ స్టేడియంలో తన నిర్ణయాన్ని వెల్లడించివుంటే, తనతో సహా అందరూ సంతోషించేవారని ఇంజమాన్ వ్యాఖ్యానించడం విశేషం.
Go Back to Shorts
MS Dhoni
Injamam
Retirement

More Telugu News